NZB: ఎర్రజొన్న రైతులను వ్యాపారుల సిండికేట్ నుంచి కాపాడాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. క్వింటాలుకు రూ. 3,850 ఉన్న ధరను రూ. 3,450కి తగ్గించడంపై ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఉత్పత్తి తగ్గినా ధర తగ్గించడం అన్యాయమన్నారు. జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని క్వింటాలుకు రూ. 4,000 వచ్చేలా చూడాలన్నారు.