SRPT: సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై దొంగలు రెచ్చిపోయారు. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం వద్ద గల రామన్న ధాబాలో అర్ధరాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి సువ్వతో కౌంటర్ తెరిచి చోరీకి యత్నించాడు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారిపై దొంగల సంచారంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.