MBNR: పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. పరీక్ష సమయాల్లో (ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు) కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 163 BNSS యాక్ట్ ప్రకారం ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు.