MNCL: నెన్నెల మండలం మైలారంకి చెందిన సర్పంచ్ సుమలత, ఉపసర్పంచ్ హరీష్, పలువురు వార్డు సభ్యులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి కొత్తగా చేరుతున్న నాయకులు కీలక పాత్ర పోషిస్తారన్నారు