WGL: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా నర్సంపేటలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ మాట్లాడుతూ, జీవ వైవిధ్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని, కాలుష్యం, ప్లాస్టిక్, రసాయన ఎరువుల వల్ల జీవరాశులు అంతరించిపోతున్నాయని ఆయన ఆవేదన పేర్కొన్నారు.