MDK: రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో ఈనెల 13న హత్యకు గురైన మహిళ ఆచూకీ నేటికీ తెలియలేదు. మహిళను బండరాయితో కొట్టి చంపారు. మృతురాలు దివ్యాంగురాలిగా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు, రహదారిపై వాహనాల రాకపోకలను తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.