KMM: నేలకొండపల్లి మండలంలోని చెరువు మాదారంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఇవాళ పశువులకు గాలికుంటు నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాహిత్య మాట్లాడుతూ.. పశువులకు వచ్చే ప్రాణాంతక వ్యాధులను అరికట్టేందుకు రైతులు ముందస్తుగా టీకాలు వేయించాలని సూచించారు. పశుపోషకులు తమ పశువుల ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు.