వరంగల్ మేయర్ స్థానం జనరల్ కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఆ సీటుపై కన్ను వేశాయి. వచ్చే మే 7న పాలకవర్గం పదవి కాలం ముగియనుండటంతో గ్రేటర్ వరంగల్ పరిధిలోని MLAలు, మాజీ MLAలు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు తమ వారసులకు మేయర్ సీటు దక్కించుకోవడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న 66 వార్డుల్లో 34 వార్డుల్లో పట్టు సాధిస్తే మేయర్ అవకాశం ఉంది.