VKB: బాలికలకు రక్షణగా ఉండాల్సిన వారే పలు సందర్భాల్లో దారి తప్పుతున్నారు. VKB జిల్లాలో ఈ ఏడాది నమోదైన 62 పోక్సో కేసులే దీనికి నిదర్శనం. బాధితులకు తెలిసిన వ్యక్తులు, బంధువులే ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఇల్లు, పాఠశాలల్లో బాలికలకు పూర్తి అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.