GDWL: జిల్లాకు చెందిన ఎస్సై తారక, కానిస్టేబుల్ శ్రీలత రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో తృతీయ బహుమతులు సాధించి జిల్లా పోలీస్ శాఖ గర్వపడేలా చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా వీరు ప్రశంసా పత్రాలు, రూ.10 వేల నగదు బహుమతిని అందుకున్నారు. విధి నిర్వహణలో ఉంటూనే మేధోశక్తిని చాటిన వీరిని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.