MNCL: బెల్లంపల్లి బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం సింగరేణి యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. ఆలయ కోనేరును శుభ్రం చేసే ప్రధాన పైప్‌లైన్ గత కొంతకాలంగా లీకేజీ విషయం ఆలయ కమిటీ సభ్యులు ఏరియా GM రాధాకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. GM ఆదేశాలతో మంగళవారం సివిల్ సిబ్బంది పైప్‌లైన్ లీకేజీని అరికట్టి కొత్తగా గేట్ వాల్‌ను ఏర్పాటు చేశారు.