JGL: జిల్లాలో విద్యుత్ వినియోగదారుల కోసం చేపట్టిన విద్యుత్ ప్రజావాణిలో 1135 సమస్యలు పరిష్కరించినట్టు, SE బి.సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించాలనే సంకల్పంతో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సర్కిల్, డివిజన్, సెక్షన్ స్థాయిలో వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.