JGL: మెట్పల్లి మండలం బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయంలో టెండర్ ద్వారా కొబ్బరికాయలు, పూజా సామగ్రి, లడ్డూ, పులిహోర విక్రయాలను ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో విక్రమ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు రూ. 20,000 డిపాజిట్ చెల్లించి, ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు వేలంలో పాల్గొనాలి. టెండర్ కాలపరిమితి 2025 అక్టోబర్ 1 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది.