VKB: బంట్వరంలోని యాచారంలో సీసీ రోడ్డు నిర్మాణానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో రూ.4 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామంలోని పాత బావి నుంచి సూర్యాపేట బీమ్ రెడ్డి ఇంటి వరకు ఈ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. గ్రామ ప్రజల తరఫున యాచారం గ్రామానికి చెందిన అడ్కిచర్ల దివ్యబాలకృష్ణా రెడ్డి స్పీకర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.