SDPT: సిద్దిపేటలోని మూడో వార్డు రంగదాంపల్లి బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు స్థానిక కౌన్సిలర్ వంగ రేణుకతో కలిసి మున్సిపల్ ఛైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు బుధవారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదేశాల మేరకు భూమి పూజ చేసినట్టు ఛైర్ పర్సన్ తెలిపారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ కె. రాజనర్సు, కౌన్సిలర్ అరవింద్ రెడ్డి, AE పృథ్వి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.