BHPL: చిట్యాల మండలం దూత్పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రశాంత్ (27) తన భూమిలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి పాడుబడ్డ బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.