KMM: కామేపల్లి 33/11 కేవీ ఉపకేంద్రం పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని కొత్తలింగాల ట్రాన్స్కో ఏఈ ఎన్. శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కామేపల్లి, ఊటుకూరు, రామకృష్ణాపురం గ్రామాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.