ADB: తాలూకా మున్నూరు కాపు సంఘం నాయకులు MLA పాయల్ శంకర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఎన్నికలలో నూతనంగా గెలుపొందిన అధ్యక్షుడు శివన్న, ప్రధాన కార్యదర్శి సంతోష్, ఉపాధ్యక్షులు శరత్, కోశాధికారి విఠల్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సమిష్టిగా పనిచేసి సంఘం అభివృద్ధికి తోడ్పాటును అందించాలని MLA సూచించారు.