NGKL: రాంనగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ధ్వజారోహణం, గరుడసేవ, బేరీ పూజలు ఘనంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. సాయంత్రం గరుడవాహన సేవ, కోలాటం, భజనలతో ఆలయం భక్తిశ్రద్ధలతో నిండింది. భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందజేయగా, శుక్రవారం కళ్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.