MDCL: నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట TG రియల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. స్లాట్ విధానం కారణంగా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ప్రవీణ్ గౌడ్ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది కొరతతో సేవలు స్తంభిస్తున్నాయని, తక్షణం అదనపు ఉద్యోగులను నియమించాలని కోరారు.