NLG: పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించినప్పుడే కుటుంబం ఉన్నతి స్థితిలో ఉంటుందన్నారు.