KMR: అభివృద్ధి కోసం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులనే గెలిపించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కోరారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంతో పాటు దూప్సింగ్ తండా, గిర్ని తండా, గాలిపూర్, మొగ్ధుంపూర్, కోమలంచ, తుంకిపల్లి గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.