HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా మధుర నగర్, వెంగళరావ్ నగర్ డివిజన్ల బూత్ కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికకు ఏర్పాట్లు, కార్యాచరణ, భవిష్యత్తు వ్యూహాలపై చర్చ జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు గెలిచేది మన కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు.