KNR: కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో 27వ బ్యాచ్ జర్నలిజం సర్టిఫికెట్స్ ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ పి.నితిన్ పాఠక్, టి.రాజయ్య ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. జర్నలిజం ఆదర్శంతో కూడుకున్న వృత్తి అని, దానికి పరిశీలన, పరిశోధన, భాషా పరిజ్ఞానం చాలా అవసరమని పేర్కొన్నారు.