MDCL: ఆల్వాల్ లయోలా కాలేజ్ సమీపంలో బుధవారం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి టిఫిన్ సెంటర్, ఫిష్ ఫ్రై దుకాణాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, డిసి భోగేశ్వర్లు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.