KMR: గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు బొంపల్లి భవాని రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దీంతో మండల ప్రజలు కుటుంబ సభ్యులు తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.