SRD: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ మేరకు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఫోన్ ద్వారా తెలిపారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు.