KNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. మానకొండూరు మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ నిధులు పెంచాలని, ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం 24న కలెక్టరేట్ వద్ద ధర్నా ఉంటుందన్నారు.