SDPT: మిరుదొడ్డిలో రేణుక ఎల్లమ్మ, జమదగ్ని మునిరాజుల కల్యాణ మహోత్సవం కనులపండువగా సాగుతోంది. సోమవారం గౌడ కులస్తులు డప్పు చప్పుళ్లతో ఎల్లమ్మ తల్లి బోనాలను వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా సిద్ధోగంలో ఏర్పాటు చేసిన ఏడు అంతరాల బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల కోలాహలంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కల్యాణ వేడుకలకు ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు.