SDPT: సిద్దిపేట టూ టౌన్ సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని కిరాణా షాపులు, టీ కొట్టుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాలు కలిగిన చాక్లెట్లు అమ్మినా, అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి అక్రమ విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమాచారం ఉంటే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.