ASF: కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్లను కేంద్రం వెంటనే రద్దు చేయాలని IFTU నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 16న కలెక్టరేట్, 23న హైదరాబాద్ లేబర్ కమిషనరేట్ ఎదుట నిర్వహించే ధర్నాల పోస్టర్లను ఆదివారం ఆసిఫాబాద్లో IFTU నాయకులు ఆవిష్కరించారు. ఏప్రిల్ ఒకటి నుంచి కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని దాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు.