MBNR: జడ్చర్ల బస్టాండ్లో ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొంగలి శ్రీకాంత్ ఆర్టీసీ ఆర్ఎం కవితకు వినతిపత్రం అందజేశారు. బస్టాండ్లో తాగునీరు, కుర్చీలు, సీసీ కెమెరాలు, ఎస్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. వర్షాకాలంలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.