SRCL: మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన పెంచినప్పుడే మార్పు సాధ్యమని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఇండియన్ సైకియాట్రిక్ సమ్మిట్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అనేక మంది మానసిక సమస్యతో సతమతమవుతున్నారు అన్నారు.