KMR: సదాశివనగర్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సందర్శించి రంజాన్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రార్థనా స్థలాల వద్ద నిఘా పెంచాలని, CC కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూనే శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని జిల్లా పోలీస్ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.