PDPL: ఓదెల మండల కేంద్రానికి చెందిన తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది సంక్రాంతి పండుగ ఉత్సవాలను తన స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. గ్రామంలోనే ఉంటూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కుమారుడితో వ్యవసాయ రంగం ప్రాముఖ్యత, అన్నదాతల కష్టాలను వివరించారు.