ప్రకాశం: మార్కాపురం నుండి బెంగళూరు వెళ్లే రాయల్ ఓవైజ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆదివారం రాత్రి మండలంలోని వేములకోట నుండి కుంట వెళ్లేదారిలో ముళ్ళకంపలోకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉండగా, ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రోజురోజుకు ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలు పెరుగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.