NGKL: RTC బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన నగదును డిపో అధికారులు భద్రంగా బాధితుడికి అందజేశారు. కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో కల్వకోలు వద్ద ఎక్కిన ఒకరు రూ.20 వేల నగదు బ్యాగును వదిలి దిగిపోయారు. గమనించిన కండక్టర్ పవన్ కుమార్ ఆ సొమ్మును కొల్లాపూర్ డీఎంకు అప్పగించారు. అనంతరం డీఎం చేతుల మీదుగా నగదును బాధితుడికి ఈరోజు అందజేశారు.