KNR: హుజూరాబాద్‌లోని పోచమ్మ వాడలో కోతులు తాళ్లపల్లి సారయ్యపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. కోతుల బెడద కారణంగా ప్రజలు రోజూ భయంతో జీవిస్తున్నారు.