BDK: కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రేపు నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ శాసనసభ్యులు పాల్గొంటారని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.