KNR: శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాల వినాయక మండప నిర్వాహకులు శుక్రవారం నిర్వహించబోయే వినాయక నిమజ్జన వేడుకలను రాత్రి 10 గంటలలోపు ముగించుకోవాలని కేశవపట్నం SI కే. శేఖర్ కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు.