RR: షాద్‌నగర్‌లోని జర్నలిస్ట్ కొండే కృష్ణయ్య ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రూ.8.62 లక్షల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు కావలి సురేందర్ పాత నేరస్తుడని, పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని ఏసీపీ ఎస్. లక్ష్మీనారయణ తెలిపారు.