BDK: మణుగూరు అంబేద్కర్ సెంటర్లో ఇవాళ తెల్లవారుజామున ఇద్దరు అనుమానిత వ్యక్తులు సంచరిస్తూ స్థానికంగా ఉన్న ఓ వెల్డింగ్ షాప్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఐరన్ తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ స్థానికులు గమనించడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఇదే దొంగలు మరో ప్రాంతంలో కూడా చోరీకి పాల్పడ్డారని సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.