JGL: అప్పుల భారం తట్టుకోలేక కోరుట్ల రామ్ నగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి వీరమల్లి ప్రసాద్ (48) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన మనవడి బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం సుమారు రూ.45 లక్షల వరకు అప్పులు చేసిన ఆయన, సొంత ఇల్లు అమ్మినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబీకులు తెలిపారు.