SRPT: విదేశాల్లో ఉన్నత చదువులకు ఆసక్తి గల అల్పసంఖ్యాక వర్గాల విద్యార్థుల నుంచి ‘సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్’కు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ అధికారి తెలిపారు. జూన్ 1 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని, జూలై 31లోపు హార్డ్ కాపీలను కార్యాలయంలో సమర్పించాలని అన్నారు. ఎంపికైన వారికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందుతాయని అన్నారు.