MBNR: జిల్లాలో జనాభా గణన ప్రక్రియను అత్యంత ఖచ్చితంగా, నిర్దేశిత సమయపాలనతో పూర్తి చేయాలని MRO ఎన్.విద్యాసాగర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటి వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని ఆయన సూచించారు. ఎంపీడీవో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి గణనను విజయవంతం చేయాలని తెలిపారు.