NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఉత్సాహంగా సాగుతుంది. ఆదివారం సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించి, నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామాభివృద్ధిలో కార్మికుల సేవలు అమూల్యమని ఆయన కొనియాడారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు.