KMM: ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. కామేపల్లి మండలంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ఆయన కలెక్టర్‌కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.