ADB: నార్నూర్ విజయనగర్ కాలనీలో గల డీఆర్ డిపోలో రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ ప్రక్రియను ఆదివారం విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుని వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేసే క్రమంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కాలనీకి చెందిన కార్డుదారులు పెద్ద సంఖ్యలో డిపోకు తరలివచ్చి తమ బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయించుకున్నారు.