MDK: రైతుల వద్ద నుంచి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. రైతులు అధైర్య పడొద్దని, జిల్లాలో బుధవారం వరకు 2,00,602 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 39,541 రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. 27,600 మంది రైతులకు రూ.286.60 కోట్ల రైతుల అకౌంట్లో జమ చేసినట్లు చెప్పారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.