MNCL : జన్నారం మండలం కలమడుగులో ఎల్లమ్మ పట్నాలకు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.